ప్రస్తుతం ఉన్నది వచ్చిది కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చినది

కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని మోసం చేశారన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మోసం చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్నది వచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని విమర్శించారు.