గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రొఫైల్ ఆవిష్కరణ
తెలంగాణలో స్టార్ అప్ కంపెనీగా ఉన్న గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రొఫైల్ ను తెలంగాణ ఐటీ మరియు ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ సిఇఓ శివంత్ ఆయనకు గ్రీన్ కోడ్ స్టార్ట్ అప్ వివరాలను చేస్తున్న సర్వీసులను తెలియజేశారు. గ్రీన్ కోడ్ ఐటీ సంస్థ రిక్రూట్మెంట్, స్టాఫ్అగ్మెంటేషన్, మరియు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కీ సంబంధించిన సర్వీసెస్ తమ కంపెనీ అందిస్తుందని, ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని శివంత్ తెలిపారు. మిషన్ 10శాతం జాబ్స్ ఫర్ అన్ ఎంప్లాయిడ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా చెబుతూ, ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పది వేల మంది నిరుద్యోగులకు 18 నెలలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే అన్నారు. ఈ మిషన్ గురించీ తెల్సుకున్న జయేష్ రంజన్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంకల్పాన్ని అభినందిస్తూ, ఈ విషయంలో తమవంతుగా అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, యుఎస్ఎ అధ్యక్షురాలు కవితా చల్లా మాట్లాడుతూ, టిడిఎఫ్ ఇండియాకి శివంత్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారని, కోవిడ్ సమయంలో ఎంతోమంది సహాయసహకారాలను అందించారని తెలియజేశారు. శివంత్ తలపెట్టిన 10కె మిషన్ విజయవంతం కావాలని, గ్రామీణ, పట్టణాల్లో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలను కల్పించాలన్న ఆశయం విజయవంతం కావాలని అంటూ గ్రీన్ కోడ్ సిఇఓ శివంత్ ను అభినందించారు.






