హైదరాబాద్-బాగ్దాద్ విమాన సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ నుంచి బాగ్దాద్‌కు నేరుగా ఫ్లయ్ బాగ్దాద్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రతి ఆది, మంగళవారాలు బాగ్దాద్‌కు విమాన సర్వీసులు నడుస్తాయని జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) అధికారులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో జీహెచ్ఐఏఎల్, ఫ్లయ్ బాగ్దాద్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు కేక్ కోసి తొలి విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. అదివారం మధ్యాహ్నం 3:17కు ఐఎఫ్-462 విమాన సర్వీసు ప్రయాణికులతో టేకాప్ తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ రాజధానిగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి రావడంతో అంతర్జాతీయ పర్యాటకులు క్యూ కడుతున్నారని జీహెచ్ఐఏఎల్ పేర్కొంది.






