అగ్నికీలల్లో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం…
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కార్యాలయంలో మంటలు ఎగిసిపడటంతో.. ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మెట్లపై కూడా మంటలు వ్యాపించడంతో.. పక్క భవనాల మీద నుంచి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల నుంచి ఫైరింజన్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత కార్యాలయంలో ఉన్న పరికరాలతోనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లు అక్కడ మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. లోపల చాలావరకు ఫైళ్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.






