MP Chamala: తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ చామల

అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) హామీ ఇచ్చారు. నార్త్ కరోలినాలోని చార్లెట్‌లో తెలంగాణ అమెరికాన్ తెలుగు అసోసియేషన్ (టీఏటీఏ-టాటా) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా తెలుగు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిలాంటి వ్యవస్థ నిర్మించాల్సి వుంది. దీని గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తా. ఇంత పెద్దఎత్తున తెలుగు కమ్యూనిటీ ఒక దగ్గర చేరి బతుకమ్మ పండగను జరుపుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది(Naveen Malipeddi) , మన్మోహన్, ప్రదీప్, నిషాంత్, నవీన్, నరేందర్ రెడ్డి, ముఖేష్, రాహుల్, స్నేహిత్, అద్వైత్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.