Police Commissioner: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Police Commissioner)గా వీసీ సజ్జనార్ (VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఎండీ (RTC MD) గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను, మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సీపీ (CP) గా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సీపీగా ఉన్న సీవీ ఆనంద్ (CV Anand)ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీవీ ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.