Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్ రికార్డులు కైవసం

ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ అతివలు ఆడిపాడిన బతుకమ్మ (Bathukamma) వేడుక గిన్నిస్ బుక్(Guinness Book) లో చోటు సంపాదించుకుంది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, ఏడు టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ తో పాటు, 1,354 మంది అతివలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు దక్కయి. దీనికి సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడిరచారు. ఆయా ధ్రువపత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) , సీతక్క (Seethakka)కు అందజేశారు.
సందడి చేసిన ప్రపంచ సుందరి ..
వేడుకలకు ప్రపంచ సుందరి ఓపల్ సుచాతతోపాటు, కాంటినెంటల్ డెలిగేట్స్ పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి సందడి చేశారు. మంత్రులు, ఇతర మహిళా ప్రజాప్రతినిధులతో చుట్టూ చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు.