Cash:ఒకరికి రూ.50 వేల వరకే అనుమతి … ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ ప్రకటనతో జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్ అమల్లో ఉండనున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు తనిఖీలు చేపట్టనుండడంతో నగదు(Cash) , నగలు (jewelry) , ఇతరత్రా వస్తువులు తీసుకెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా వెంట రసీదులు తీసుకెళ్లాలి. ఈ ఎన్నికలు ముగిసే వరకూ ఒక వ్యక్తి రూ.50వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్తే తప్పనిసరిగా ఆధారాలు చూపించాలి. లేకుంటే సిబ్బంది ఆ నగదును సీజ్ చే స్తారు.ఎకువ మొత్తంలో నగదు దొరికితే ఐటీ, జీఎస్టీ (GST) అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమచేస్తారు. తకువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు.
ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిండ్లు వంటి అవసరాలకు పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. బ్యాంకు లావాదేవీల్లో భాగంగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం వెంట తీసుకెళ్లాలని, వ్యాపార లావాదేవీల్లో వస్తువులు, ధాన్యం విక్రయించిన డబ్బు అయితే సంబంధించిన బిల్లులు, ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని సూచిస్తున్నారు. తగిన పత్రాలు చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.