తెలంగాణలో పెట్టుబడులకు సైబర్ వ్యూ ఆసక్తి

టెక్నాలజీ హబ్‌ల నిర్మాణం, నూతన పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడంలో విశేష అనుభవం ఉన్న సైబర్ వ్యూ అనే మలేసియాకు చెందిన సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కౌలాలంపూర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు నిర్వహించారు. తెలుగు మూలాలు ఉన్న సెలం గోర్ ప్రావిన్స్ ఉపాధ్యక్షుడు గణబతిరావు వీరమన్, హైదరాబాద్‌కు చెందిన టీ కన్సల్ట్ సంస్థ చైర్మన్ సందీప్ మక్తల పాల్గొన్నారు. తెలంగాణలో సాంకేతిక పురోగతి, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను పరిశీలించేందుకు రావాలని గణబతిరావును మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. మలేసియాలో రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెలంగోర్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధులకు టీ కన్సల్ట్ సంస్థ మధ్య అంగీకారం కుదిరింది. మలేసియాలో జరిగిన తెలుగు ఉత్సవాల్లో వారితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.