ED Office : ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం (ED Office )వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ (Mahesh Gowda) నేతృత్వంలోని నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.