యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్‌కు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.