Bandi Sanjay:తక్షణమే చెల్లించాలి .. లేదంటే తీవ్ర పరిణామాలు : బండి సంజయ్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. హైదరాబాద్ నల్లకుంటలోని శంకర మఠాన్ని (Shankara Math) సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పెండిరగ్ ఫీజులన్నీ చెల్లించేవరకు విద్యాసంస్థలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యాలు లొంగవద్దని సూచించారు. వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అంగీకరించవద్దన్నారు. ప్రభుత్వాన్ని బకాయిలు అడిగితే విజిలెన్స్ (Vigilance) దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. బిహార్ (Bihar) ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా? తక్షణమే వాటిని చెల్లించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయం. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఈ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలవడం ఖాయం అని తెలిపారు.