KCR: కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో మాజీ మంత్రులు కేటీఆర్(KTR) , హరీశ్‌రావు (Harish Rao) భేటీ అయ్యారు. ఎర్రవల్లి (Erravalli)లోని ఫాంహౌస్‌లో ఈ సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్ని రోడ్‌షోలు, ప్రచార వ్యూహాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా వారు చర్చించినట్లు సమచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రచార వ్యూహాలపై వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.