Revanth Reddy : ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్ (Bihar ) లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర(Voter Adhikar Yatra) లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. సుపౌల్‌లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. సీఎంతో రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.