Modi: ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
దేశ రాజధాని ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. భారత్ ప్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ (Global Summit) కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా సీఎం ఆహ్వానించనున్నారు.






