సీఎం రేవంత్ ను కలిసిన జర్మనీ రాయబారి

హైదరాబాద్ వచ్చిన భారత్‌లోని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను సత్కరించారు. సికింద్రాబాద్ ఆర్‌పీఓ జొన్నలగడ్డ స్నేహజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే సీఎంతో యునైటెడ్ బేవరేజెస్ సంస్థ ప్రతినిధులు సైతం భేటీ అయ్యారు. సంస్థ ఎండీ, సీఈవో వివేక్‌గుప్తా, చీఫ్ సేల్స్ ఆఫీసర్ రాకేశ్ కుమార్, ప్రతినిధి మోనోజిత్ ముఖర్జీ తదితరులు ఉన్నారు.