ఈ నెల 21న యాద్రాదికి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం ఆ రోజు రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పత్తి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.