తెలంగాణ జాతికి తీరని లోటు
తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు మరణం తెలంగాణ జాతికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణకు దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్‌రావు అని కొనియాడారు. విద్యాసాగర్‌రావు తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎంతో తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పునరాకృతిలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేశారు. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.













