ఈ నెల 9న సీఎం చంద్రబాబు నూతన గృహప్రవేశం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన గృహంలోకి ఆదివారం ఉదయం ప్రవేశించనున్నారు. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం అమరావతి నుంచి బయలుదేరి రానున్నారు. ఆ రోజు ఇక్కడే ఉండి సోమవారం ఉదయం సత్వనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అది పూర్తయిన తరువాత కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి వెళతారు. గృహప్రవేశం పూర్తిగా కటుంబసభ్యులకే పరిమితమని, ఇతరులకు ఆహ్వానాలేమి పంపలేదని సమాచారం.






