కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న కొత్తగా నిర్మించిన గృహంలో అడుగు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో చంద్రబాబుకు ఉన్న పాత నివాసాన్ని నేలమట్టం చేసి ఆ స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈనెల 9న ఉదయం 9:15 గంటలకు ఆయన గృహ ప్రవేశం జరపాలని వేదపండితులు ముహూర్తాన్ని ఖరారు చేయడంతో ఆ రోజున చంద్రబాబు దంపతులు ఇంట్లోకి ప్రవేశించనున్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నివాసంలో సమావేశ మందిరం, కార్యాలయంతో పాటు, జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు.






