KiranKumar Reddy : బీఆర్‌ఎస్‌లో అలాంటి పరిస్థితి ఉందా? : ఎంపీ చామల

కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు (Harish Rao) విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ(AICC) సమావేశాల్లో రేవంత్ పాలనను రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశంసించారని తెలిపారు. సమాచార లోపం వల్లే ఢల్లీిలో కాంగ్రెస్ బీసీ దీక్షకు రాహుల్ గాంధీ రాలేదు. హరీశ్‌రావు ఏదో ఒక వంకతో కాంగ్రెస్ నేతలపై విషప్రచారం చేస్తున్నారు. మా పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్‌గా బీసీ వ్యక్తి ఉన్నారు. బీఆర్‌ఎస్ (BRS) లో అలాంటి పరిస్థితి ఉందా?. రానున్న బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజు బీసీ వ్యక్తిని ఆ పార్టీ అద్యక్షుడిగా నియమించాలి అని కిరణ్ సవాల్ విసిరారు.