Waqf Board : వక్ఫ్‌బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు : కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్ (Digitalization) చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు (Waqf Board) ఆస్తుల ద్వారా వచ్చే ఆయాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై వచ్చిన ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింల (Muslim)కు పంచుతామన్నారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలని కోరారు. జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు అన్ని వర్గాల వారిని ఆహ్వానించాలని పార్టీ నేతలను కోరారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు సూచించారు.