పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి ఇదే : వినోద్ కుమార్

ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రధానితో సహా చాలా మంది స్వాగతించారని తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి ఇదే అని పేర్కొన్నారు. రోహిణి కార్తె సమయంలో రైతులు పెట్టుబడి కోసం తిరుగుతారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట కోతల తర్వాత రైతుబంధు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇస్తామన్న రైతు భరోసా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. రైతు భరోసా అమలు చేసిన ఎకరాకు రూ.15 వేలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి పండిరచిన రైతులకు రూ.500 బోనస్ ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు.