BRS: రజతోత్సవ సభకు అనుమతి నిరాకరణ.. హైకోర్టుకు బీఆర్‌ఎస్

ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration) కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 17కి వాయిదా వేసింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 27న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి వరంగల్ సీపీ(Warangal CP), కాజీపేట ఏసీపీ(Kazipet ACP)ని బీఆర్‌ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. దీంతో ప్రతివాదాలకు హైకోర్టు నోటీసులు (Notices) జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ నెల 21 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.