12న బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో ఈ నెల 12న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదు, జిల్లాలు, శాసనసభ (Legislative Assembly), పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల నియామకం, ఇతర పదవుల భర్తీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణ సహా భవిష్యత్ కార్యచరణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సహా కీలక నేతలు ఇందులో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






