High Court :హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు : రాకేశ్‌రెడ్డి

గ్రూప్-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ (TGPSC)కి చెంపచెట్టు అని బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మానిదే అంతిమ విజయమని హైకోర్టు(High Court) తీర్పులో స్పష్టమైందన్నారు. పోరాడిన అభ్యర్థులది విజయం, అండగా నిలిచిన బీఆర్‌ఎస్ (BRS)ది నైతిక విజయం. పరీక్షల్లో 10 మంది అభ్యర్థులు ఎలా పెరిగారు? ఇది కూడా సైబర్ నేరమా? పక్కాగా ఒక ప్యాటర్న్ ప్రకారం మార్పులు వేసినట్లు కనిపిస్తోంది. గ్రూ`1 మెయిన్స్ పరీక్షల్లో 21 ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు.