మెట్ల బావిని సందర్శించిన బ్రిటిష్ హై కమిషనర్

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేట్‌లో ఇటీవల ఆధునికీకరించిన పురాతన మెట్ల బావిని బ్రిటిష్ హై కమిషనర్ కామెరూన్ సందర్శించారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన మెట్ల బావిని పునరుద్దరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌లోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలను ప్రశంసించారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు.