ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు
ఆటా వేడుకల్లో భాగంగా డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. కొత్తతరం రచయితలతో అనుసంధానం పేరుతో జరిగే ఈ సదస్సులో ఎంతోమంది యువ రచయితలు, రచయిత్రులు పాల్గొంటున్నారు. ఉదయం 9.30కు ముందుతరాలతో సంభాషణ పేరుతో జరిగే కార్యక్రమంలో కె. శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కె. శ్రీనివాస్, వోల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారు. 11.30 నుంచి 12.30 వరకు నవ కవిసమ్మేళనం జరుగుతుంది.
ఇందులో కొత్తతరం కవుల కవితాగానం, ఇప్పటి కథకులు, ఆలోచనలు, అనుభవాలు మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు జరుగుతుంది. ఇందులో కెఎన్ మల్లీశ్వరి, వెల్లండి శ్రీధర్, పూడూరి రాజిరెడ్డి, వెంకట శిద్దారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతికుమారి బండ్లమూడి పాల్గొంటారు. మధ్యాహ్నం?3.30 నుంచి 5.30 వరకు పద్యం, పాట., జానపదం కార్యక్రమం జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్, చంద్రబోస్, గోరెటి వెంకన్న, అనంత శ్రీరామ్, సిరాశ్రీ, శ్రేష్ట, ప్రొద్దుటూరి యెల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.






