POCSO Court : నల్గొండ కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్‌చార్జి జడ్జి రోజారమణి (Judge Rojaramani) తీర్పు వెలువరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పరి పీఎస్ (Tippari PS ) లో మహ్మద్ ఖయ్యూమ్ (Mohammed Qayyum) అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా, తాజాగా తీర్పు వెల్లడైంది.