Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కి బెయిల్

మద్యం కుంభకోణంలో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) కి విజయవాడ ఏసీబీ కోర్టు (ACB court) బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన తీర్పును న్యాయాధికారి పి.భాస్కరరావు (Bhaskara Rao) వెలువరించారు. రూ.2 లక్షల పూచీకత్తును సమర్పించాలని, సోమవారం, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సిట్ ఎదుట హాజరుకావాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, కేసు గురించి బయట మాట్లాడొద్దని, ల్యాండ్‌లైన్, ఆధార్‌కార్డు, మొబైల్ నంబరు కోర్టులో ఇవ్వాలని షరతులు విధించింది. జూలై 19న సిట్ అధికారులు మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Rajahmundry) కేంద్ర కారాగారంలో 71 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్‌పై కోర్టు తీర్పు అనంతరం సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదలయ్యారు.