Ontimitta: టీటీడీ తరహాలో ఒంటిమిట్టలో కూడా : బీఆర్ నాయుడు
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట (Ontimitta) కోదండ రామస్వామి ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu) దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ చైర్మన్, కలెక్టర్, ఎస్పీలు భక్తులకు భోజనం వడ్డించారు. గతేడాది రాములవారి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వచ్చిన సందర్భంగా టీటీడీ (TTD) తరహాలో ఇక్కడ కూడా నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మరో వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో టీటీడీ అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. మరోవైపు ఏప్రిల్ 1న జరగబోయే ఒంటిమిట్ట సీతారామ కల్యాణ మహోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






