Raymond: రేమాండ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
విశాఖలో సీసీఐ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నుంచి రేమాండ్ (Raymond) ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైనీ (Gautam Maini) పాల్గొన్నారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3`4 ఏళ్లలోనే చేరుకుంటాం. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల పెట్టుబడులు సాధించాం. 2027 నాటికి ఈ మూడు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చింది. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. కియా మోటర్స్ ఇప్పటికే ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయం. ప్రపంచ డేటా సెంటర్‌గా విశాఖ మారనుంది. ప్రస్తుతం పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది అని అన్నారు.






