విశాఖ పోర్టు దేశంలోనే… మొదటి స్థానం

సముద్ర ఉత్పత్తుల రవాణాలో భారతదేశంలోనే విశాఖ పోర్టు అగ్రగామిగా నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 17,983.99 కోట్ల విలువచేసే 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్ట్ దేశంలోనే నంబర్ 1 పోర్ట్గా నిలిచిందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు తెలిపారు. విశాఖపట్నం పోర్ట్ తరువాత, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ 6,395.70 కోట్లు విలువైన 2,40,253 టన్నుల సముద్ర ఆహారాన్ని రవాణా చేసి రెండవ స్థానంలో నిలిచిందన్నారు. కొచ్చిన్ పోర్ట్ 6,120 కోట్ల విలువ చేసే 1,81,400 టన్నుల సముద్ర ఆహారాన్ని రవాణా చేసి మూడవ స్థానంలో ఉందన్నారు. 2023`24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 60,523.89 కోట్ల విలువచేసే 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.