Vikram: అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్ ప్రమాణస్వీకారం
మండలి వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార బాషాసంఘం అధ్యక్షుడిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత పూల త్రివిక్రమరావు. విజయవాడలో అధికార లాంఛనాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంసృతిక మరియు పర్యాటకశాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొని విక్రమ్ చేత ప్రమాణస్వేకారం చేయించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఏరికోరి ఈపదవికి అన్నివిధాలుగా విక్రమ్ అర్హుడని ఎంపిక చేసారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టి.డి.జనార్దన్ ప్రశంసించారు. తనకు విక్రమ్ కు వున్న అవినాభవ సంబంధాలను వివరిస్తూ పార్టీకి అయన చేసిన సేవలను కొనియాడారు. ఇంతటి సౌమ్యుడిని తాను చూడలేదని తెలుగు బాష పట్ల విక్రమ్ కు ఉన్న పట్టును బాషా పటిమను ప్రస్తుతించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విక్రమ్ పట్ల అత్యంత గౌరవం ప్రేమాభిమానాలు వున్నందు వల్ల మనతెలుగుకు మరింత సేవ చేయగలరని ఏరికోరి ఎంపిక చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు నడింపల్లి సీతారామరాజు మాట్లాడుతూ మా పాత్రికేయ మిత్రుడు విక్రమ్ నేను కలిసి మెలసి పనిచేసిన మిత్రులమని. వారు తెలుగు దేశం పార్టీకి అంకితభావంతో పనిచేశారని. అందుకే ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరైన జనార్దన్ …విక్రమ్ ల మిత్రత్వం శ్రీకృష్ణార్జునల వంటిదని వారిద్దరి కలయికతో పార్టీ చరిత్ర.. ఎన్టీఆర్ చంద్రబాబులు మన రాష్ట్రాభివృద్ధికి నిరుపేదల అబివృద్ధికి చేసిన అనిర్వచనీయమైన కృషిని పూసగుచ్చినట్లు వెలువరించింన పుస్తకాలే నిలువెత్తు సాక్ష్యమని రాజు ప్రశంసించారు.. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇన్ని రచనలు నాటి కారల్‌మార్క్స్ లెనిన్ ల మీద ఇన్ని రకాలుగా పుస్తకాలు వెలువడలేదని అన్నారు…






