Union Minister Pemmasani : వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాది మారాయి : కేంద్ర మంత్రి పెమ్మసాని
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి (Amaravati) అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభ లో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా (Om Birla) చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. రాజధాని అమరావతి (Amaravati) బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నా అదష్టం. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు. ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలి. రాజధాని ఉద్యమంలో పోరాడిన మహిళలకు జేజేలు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాల భూమిని సమీకరించిన వ్యక్తి సీఎం చంద్రబాబు (CM Chandrababu). ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి. వికేంద్రీకరణ పేరుతో అప్పటి సీఎం జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం, అవమానంపై చర్చించాలి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో రాజధాని ప్రాంత మహిళలు యాత్ర చేపడితే వేధించారు. మహిళా రైతులను మేకులు ఏర్పాటుచేసిన లాఠీలతో జగన్ కొట్టించారు. వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయి. జగన్ అణిచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంలా మారి దేశాన్ని ఆకర్షించింది అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






