జూన్ 1 నుంచి శ్రీవారి అనుగ్రహం
ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్లైన్లో విడుదలచేసే ఆర్జిత సేవ టిక్కెట్లు, ఈ-దర్శన్ కౌంటర్లలో అందుబాటులో ఉన్న సేవా టిక్కెట్లు బుకింగ్‌లో మరింత పారదర్శకత పెంచేందుకు జూన్ మొదటి వారం నుంచి ‘శ్రీవారి అనుగ్రహం’ పేరుతో లక్కీడిప్ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. ఈ విధానంలో రెండు రోజుల పాటు బుకింగ్ సమయం ఉంటుందని, డిప్ తీసిన సమయం ఉంటుందని, డిప్ తీసిన తరువాత టిక్కెట్టు పొందిన భక్తులు రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. టిటిడి పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దాదాపు 7వేల కిలోల బంగారానికి సంబంధించి స్వల్పకాలిక డిపాజిట్‌కు 1శాతం వడ్డీ మాత్రమే వస్తోందని, ఈ బంగారు డిపాజిట్లను ఉపసంహరించి దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్ చేయడం ద్వారా 2.5 శాతం వడ్డీ వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.






