TTD: గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ఒంటిమిట్ట శ్రీరాములవారి కల్యాణోత్సవానికి రావాలంటూ టీటీడీ(TTD) గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer), సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ని ఆహ్వానించింది. విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను, ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkayya Chowdary), డిప్యూటీ ఈవో శివప్రసాద్, అర్చక బృందం తో కలిశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల కల్యాణానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, బొక్కసం ఇన్‌ఛార్జి గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






