ఈ నెల 8 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఏటా చైత్ర పౌర్ణమి ముగిసేలా ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 8నుంచి 10వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు.






