వరద బాధితులకు తానా సహాయం
తానా ఆధ్వర్యంలో విజయవాడ లోని గొల్లపూడిలో, విజయవాడ సెంట్రల్ లో వరద బాధితులకు 800కు పైగా నిత్యావసర వస్తువులతో ఉన్న పెట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపి కె. అప్పల నాయుడు, సుబ్బారావు బొమ్మసాని తదితరులు పాల్గొని తానా వరదబాధితులకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో ఈ సహాయ కార్యక్రమాలు జరిగాయి. తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు వరద బాధితులకు సహాయం అందించిన తానా ఫౌండేషన్ టీమ్ ను అభినందించారు.







