ఏపీలో కియో మోటర్స్ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియో మోటర్స్ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. రూ.12వేల 900 కోట్ల భారీ వ్యయంతో అనంతపురం జిల్లా యర్రమంచి గ్రామంలో ఈ కార్ల తయారీ కర్మాగారానికి అంగీకారం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అంగీకారం కుదిరింది. కియో మోటార్స్ ప్రతినిధి పార్క్, రాష్ట్ర పరిశ్రమలశాఖల కార్యదర్శి ఆరోగ్యరాజులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతగాంచిన ఈ కార్ల తయారీ సంస్థ మనరాష్ట్రానికి రావడం సంతోషదాయకమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కియో ప్రతినిధులు మనరాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపడంతో పాటు 630కి పైగా చరవాణిల ద్వారా (ఎస్ఎంఎస్) వెల్లడించారు. ప్రపంచం లోనే మోటారు తయారీ కంపెనీలకి లేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కియో మోటర్స్ సంస్థకు ఉందని అన్నారు. ఈ సంస్థ సగటున 56 నిమిషాలకు ఒకకారును ఉత్పత్తి చేస్తుందని అన్నారు. సంవత్సరానికి దాదాపు 3 లక్షల 70 వేల పైచిలుకు కార్లను కియో మోటార్సు ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఇందులో 90 శాతం కార్లు స్వదేశీ విక్రయాలకు అనుమతించినట్లు తెలిపారు. కేవలం 10శాతం కార్లను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు.













