తిరుమల శ్రీవారిని దర్శించున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సుధామూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల సుధామూర్తి మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా దేశానికి సేవ చేయడానికి తన స్థాయికి తగిన కృషి చేస్తానన్నారు.