Narendra Modi:మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ!
పుట్టపర్తి (Puttaparthi) సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) , ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan,), సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.వీవీఐపీల రాక సందర్భంగా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 19వ తేదీన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు విమానాశ్రాయానికి ప్రధాని రానున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ సభ మందిరంలో జయంత్యుత్సవాల సందర్భంగా సత్యసాయిబాబా మహా సమాధిని మోదీ దర్శించుకుంటారు.అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శతజయంతి వేడుకల్లో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో మోదీతోపాటు చంద్రబాబు, పవన్, నారా లోకేశ్‌తోపాటు జయంత్యుత్సవాల కమిటీ, ఏపీ మంత్రుల బృందం పాల్గొంటారు.






