శ్రీవారికి స్వర్ణపాదుకల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అమెరికాకు చెందిన లక్ష్మి అనే భక్తురాలు ఆదివారం ఉదయం స్వర్ణపాదుకలను బహుకరించారు. రూ.61లక్షలు విలువచేసే 2.2 కిలోల బరువున్న స్వర్ణపాదుకలను తితిదే జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు.






