అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. అమరావతి నిర్మాణానికి ఆయన రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. రాజధాని నిర్మాణానికి పెద్దలు, చిన్నారులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని, ప్రజల సంఘీభావం, భాగస్వామ్యం తన కర్తవ్యాన్ని మరింత పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు.






