ప్రధాని చేతులమీదుగా జాతికి అంకితం చేస్తాం: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తిచేసి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతులు మీదుగా జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) తో భేటీ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. పోలవరం (Polavaram) సత్వర పూర్తికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పాటిల్ హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారాలకు సంబంధించి నిధులను సకాలంలో సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. రెండో దశలో కీలకమైన భూసేకరణ, పునరావాసానికి వెంటనే నిధులివ్వాలని కోరామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కోరామని తెలిపారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి






