Minister Lokesh :ఆదిచుంచనగిరి మఠాధిపతితో మంత్రి లోకేశ్ భేటీ

కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మికం కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి (Sri Adichunchanagiri) మహాసంస్థాన మఠాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh ) సందర్శించారు. మఠం 72వ పీఠాధిపతి నిర్మలానందనాథ స్వామి (Nirmalanandanatha Swamy) ని సత్కరించి, ఆశీస్సులు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరగా మఠాధిపతి సుముఖత వ్యక్తం చేశారని లోకేశ్ తెలిపారు. మఠం ఆవరణలోని శ్రీకాలభైరవేశ్వరస్వామి (Sri Kalabhairaveswara Swamy)ని దర్శించుకొని పూజలు చేశారు. మఠం నిర్వహణలోని విద్యాసంస్థలు, వైద్య కళాశాల, ఆసుపత్రి విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించారు. విద్యార్థులు వేసిన లోకేశ్ చిత్రాన్ని నిర్మలానందనాథ మంత్రికి అందజేశారు.