Minister Mandipalli : స్త్రీశక్తి పథకం విజయవంతం : మంత్రి మండపల్లి
స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ పథకానికి రూ.95 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఉచిత ప్రయాణం కోసం త్వరలో స్మార్ట్ కార్డులు (smart cards) ప్రవేశపెడతామన్నారు. 60 శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో (RTC buses) వెళ్తున్నారని వివరించారు. ఆరు నెలల్లో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పల్లెల నుంచి పట్టణలకు ఏసీ బస్సులు నడపాలనేది సీఎం చంద్రబాబు (Chandrababu) ఆలోచన అని మంత్రి వివరించారు. ఆటో డ్రైవర్ల (auto drivers ) కోసం ప్రత్యేక పథకం తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు.







