Andeshri: అందెశ్రీ గుండెపోటుతో చనిపోయారు : గాంధీ వైద్యుడు సునీల్
అస్వస్థతకు గురైన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andeshri) సోమవారం ఉదయం 7:20 గంటలకు గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తీసుకువచ్చారని వైద్యుడు సునీల్ కుమార్ (Sunil Kumar) తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మా దగ్గరి వచ్చేటప్పటికే ఆయన చనిపోయి 5 లేదా 6 గంటలు అయినట్లు ఉంది. అందెశ్రీకి 15 సంవత్సరాలుగా రక్తపోటు (బీపీ ) ఉంది. దీనికి సంబంధించిన మందులను నెలరోజులుగా ఆయన వాడటం లేదని తెలిసింది. 3 రోజులుగా ఆయాసంతో బాధపడుతున్నారు. రాత్రి భోజనం చేశాక మామలుగానే పడుకున్నారు. ఉదయం వెళ్లి చూస్తే కిందపడి ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు అని సునీల్ కుమార్ తెలిపారు.







