Davos: స్విస్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికోలస్ సామ్యూల్ గగ్గర్ తో మంత్రి లోకేష్ భేటీ
ఎపిలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు సహకారం అందించండి
దావోస్: స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్ (Nicolas Samuel Gaggar) తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మేం భావిస్తున్నాం. ఎపిలో నెస్లే, రొషే, నోవార్టిస్, ఎబిబి, క్లారియంట్, హిల్టీ, బుచర్, ఎస్ టి టెలిమీడియా, ఒసి ఒర్లికా వంటి స్విస్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా ఆహ్వానించేందుకు మేం ఆసక్తితో ఉన్నాం. వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు భాగాల విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ, R&D హబ్‌ల ఏర్పాటుకు సహకారం అందించండి. ఎపి, స్విస్ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయడానికి మీ సహకారం అవసరం. AI, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్ట్-అప్లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో ఎపి, స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలను కనెక్ట్ చేయడంలో మీ మద్దతు అవసరమని మంత్రి లోకేష్ తెలిపారు.
శామ్యూల్ గగ్గర్ మాట్లాడుతూ… ఎపిలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.






