Nara Lokesh: ఎస్ టి టెలీ మీడియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ రీతూ మెహ్లావత్ తో లోకేష్ భేటీ
విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి
Singapore: ఎస్ టి టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ (India) హెడ్ రీతూ మెహ్లావత్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సింగపూర్ లో భేటీ అయ్యారు. (సింగపూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్ టి టెలీమీడియా వ్యూహాత్మక పెట్టుబడి సంస్థ. కమ్యూనికేషన్స్, మీడియా, డేటా సెంటర్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీలలో ప్రపంచవ్యాప్త పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది.) ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భారత్ లో కార్యకలాపాలను రెట్టింపు చేయాలని భావిస్తున్నందున డాటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్ టి టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డాటా సెంటర్ ఏర్పాటుచేయండి.
ఉత్తర ప్రదేశ్ తరహాలో అత్యాధునిక డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఆప్టిమైజేషన్ ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు. రీతూ మెహ్లావత్ స్పందిస్తూ… భారత్ లో తాము ప్రస్తుతం 10 ప్రధాన నగరాల్లో 311 మెగా వాట్ల క్రిటికల్ ఐటి లోడ్ తో 30 డాటా సెంటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత్ లో తమ డాటా సెంటర్ల సామర్థ్యాన్ని 550 మెగా వాట్లకు పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి, నిర్ణయం తీసుకుంటామని రీతూ మెహ్లావత్ తెలిపారు.







